This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో వీపులో నొప్పి

Pregnancy Journey
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 19, 2026
గర్భధారణ సమయంలో వీపులో నొప్పి
Likes28 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో 50 నుండి 80 శాతం మంది కాబోయే తల్లులు వీపు నొప్పితో బాధపడతారు, ఇది మొదటి ఇంకా మూడవ త్రైమాసికంలో సర్వసాధారణం.
  • హార్మోన్ల మార్పులు, రిలాక్సిన్ హార్మోన్ ప్రభావం, పెరిగిన వక్షోజాల బరువు ఇంకా శరీర గురుత్వ కేంద్రంలో మార్పు వీపు నొప్పికి ప్రధాన కారణాలు.
  • సపోర్టివ్ షూస్, చక్కగా నప్పే బ్రా, ప్రినేటల్ మసాజ్, వెచ్చని లేదా చల్లని కాపడం, స్ట్రెచింగ్ ఇంకా చక్కని శరీర భంగిమ నొప్పిని తగ్గిస్తాయి.
  • వీపు నొప్పి నుండి ఉపశమనం ఎలా పొందాలి? Explore our Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Compression Stocking Socks - S
Compression Stocking Socks - S
Rating4.5
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

గర్భధారణ సమయంలో తీవ్రమైన వీపు నొప్పితో 50 నుండి 80 శాతం మంది కాబోయే తల్లులు బాధపడతారు. కొంతమంది గర్భవతులకు ఈ వీపులో నొప్పి కాస్త తక్కువగా ఉంటుంది, కొందరికి వీపులో ఇంకా మెడ లేదా భుజాలలో కూడా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. గర్భధారణ సమయాలలో వీపులో నొప్పి, నడుము నొప్పి కన్నా తక్కువ సార్లు వచ్చేది అయినా, వీపునొప్పి సాధారణంగా వచ్చే అవకాశముంది. చాలా మంది కాబోయే తల్లులకు ఈ సమస్య అసౌకర్యాన్ని కలిగించేలా, చురుకుదనం తగ్గించేలా ఉంటుందని, వారి పనితీరును పరిమితపరిచేలా తీవ్రంగా కూడా ఉంటుందని వైద్యులు విశ్వసిస్తారు. అంతేకాక, రోజంతా నడిచి ఇంకా నిలబడి పనులు చేసుకొనేటప్పుడు, కాబోయే తల్లులకు, ఇది ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది..

గర్భధారణ సమయంలో వీపు నొప్పి ఎప్పుడు మొదలవుతుంది (When does upper back pain start in pregnancy in Telugu) ?

గర్భధారణ సమయంలో వీపునొప్పి ఏ క్షణంలోనైనా మొదలవ్వవచ్చు, అయితే ఇది మొదటి ఇంకా మూడవ త్రైమాసికపు గర్భవతుల్లో సర్వసాధారణం. గర్భధారణ సమయంలో వారు తరచుగా తీవ్రమైన వీపు నొప్పిని అనుభవించవచ్చు. ఈ నొప్పికి ప్రధానంగా గర్భధారణ ప్రారంభ సమయాల్లో హార్మోన్ల పెరుగుదల ఇంకా రెండవ త్రైమాసికపు సమయంలో పొందే అధిక ఒత్తిడికి కారణమని చెప్పవచ్చు. పెరుగుతున్న వక్షోజాల పరిమాణం ఇంకా గురుత్వ కేంద్రం లేదా గరిమనాభిలో మార్పు కూడా మూడవ త్రైమాసికంలో వీపు నొప్పికి కారణం కావచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో వెన్నునొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

గర్భధారణ సమయంలో వీపు నొప్పికి కారణాలు (Causes of back pain during pregnancy in Telugu)

హార్మోన్ల స్థాయిలలో మార్పులు మరియు ఒత్తిడి అనేవి గర్భధారణలో వచ్చే వీపు నొప్పికి గల అనేక కారణాలలో కేవలం రెండు మాత్రమే. ఉదాహరణకు, రిలాక్సిన్ అనే హార్మోన్ గర్భధారణకు ఇంకా ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది, అయితే ఇది శారీరకమైన బాధలు మరియు నొప్పులతో సహా కొన్ని అవాంఛనీయ దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు స్నాయువులు(లిగమెంట్లు) మరియు కండరాల బిగువును వదులుగా చేస్తాయి, వాటి పనితనం కష్టతరం చేస్తాయి, తత్ఫలితంగా నొప్పి పెరగడం జరుగుతుంది.

పెరిగిన వక్షోజాల బరువు వల్ల కూడా నొప్పులు రావొచ్చు. వక్షోజాల పరిమాణం పెరగడం వల్ల ఛాతీపై బరువు పెరుగుతుంది, శరీర భంగిమలు కూడా మారవచ్చు, దానివల్ల వీపు భాగంలో కండరాల పనితనంపై ప్రభావం చూపడం వల్ల అలసట పెరుగుతుంది. అయితే, గర్భాశయంలో మార్పులు ఇంకా బరువు పెరగడం ద్వారా గర్భధారణలో వీపులో నొప్పి లేదా ఈడ్పు లాంటి నొప్పిని కలిగించవచ్చు. గర్భాశయం పైవైపుకి మరియు ముందుకి వ్యాకోచిస్తున్నప్పుడు శరీరపు గురుత్వాకర్షణ కేంద్రం మారుతుంది. దానివల్ల "గర్భధారణ సంబంధిత లార్డోసిస్," లేదా వెన్నెముక్క లోపలి వక్రత పెరుగుతుంది. గర్భధారణ సమయంలో సంభవించే బరువు మార్పులతో పాటు, ఈ మార్పు కండరాల నొప్పులకు కూడా కారణం కావచ్చు, ఇది చాలా బాధాకరమైనదిగా కూడా ఉండవచ్చు.

గర్భధారణ సమయంలో ఈ వీపు నొప్పికి విరుగుడు ఏంటి (How to get rid of upper back pain during pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో వచ్చే వీపు నొప్పి చాలా సాధారణమైనప్పటికీ, ఉపశమనం పొందడానికి మార్గాలు కూడా ఉన్నాయి.

  • ఆక్యుపంక్చర్, శరీర బలాన్ని పెంచుకొనే వ్యాయామాలు చేయడం ఇంకా చురుకుగా ఉండటం ద్వారా వీపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
  • ఆరోగ్యకరమైన బరువును పొందడం కూడా ముఖ్యం.
  • వక్షోజాల పరిమాణం పెరగడం వల్ల గర్భధారణలో వీపు నొప్పి వచ్చినట్లయితే, సపోర్టివ్ షూస్ ఇంకా చక్కగా నప్పే బ్రా ఈ లక్షణాలను గణనీయంగా తగ్గిస్తుంది.
  • నొప్పి లక్షణాలను తగ్గించడానికి, కొంతమంది నిపుణులు ప్రినేటల్ మసాజ్‌ కూడా మంచిదని సలహా ఇస్తారు.
  • అంతేకాక, వెచ్చని లేదా చల్లని కాపడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
  • నొప్పి అలాగే కొనసాగుతుంటే, నొప్పి నివారణ మందులను చివరిగా ప్రయత్నించాలి.
  • రెగ్యులర్ స్ట్రెచింగ్, చక్కని తీరు ఇంకా బరువైన వస్తువులను ఎత్తకుండా ఉండటం లాంటివన్నీ వీపు నొప్పి రాకుండా ఉండేందుకు సిఫార్సు చేయబడ్డాయి.
  • ఛాతీని పైకి లేపడం ఇంకా వెన్నుని ముందుకు వంచడం వల్ల టెన్షన్ మరియు ఒత్తిడి తగ్గుతుంది..

గర్భవతులకు వీపులో నొప్పి అనిపించినప్పుడు డాక్టరు గారిని ఎప్పుడు సందర్శించాలి (When to visit a doctor if you experience upper back pain while pregnant in Telugu)?

గర్భదారణ సమయంలో వీపులో నొప్పి అనేది కాబోయే తల్లుల అసౌకర్యానికి ఒక ముఖ్యమైన కారణం. కానీ సాధారణంగా, ఇది ఆందోళన కలిగించే పెద్ద కారణం కాదు. గర్భధారణ సమయంలో వీపులో నొప్పి వారి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది తప్ప, అది ఆందోళన కలిగించదు. ఆందోళన కలిగించే విషయమేమిటంటే, అరుదైన సందర్భాల్లో, కాలేయ సమస్యలు లేదా ఛాతీలో ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన పరిస్థితులు వీపు నొప్పితోనే మొదలవుతాయి. అకాల ప్రసవం కూడా గర్భధారణ సమయంలో తీవ్రమైన వెన్నునొప్పికి కారణం కావచ్చు. అందువల్ల ప్రసూతి వైద్యులను ఇంకా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో అవసరం. వీపు నొప్పి నిరంతరంగా బాధిస్తున్నట్లయితే ఇంకా అది కాబోయే తల్లిపై తీవ్రమైన ప్రభావం కలిగిస్తూ ఉంటే, వెంటనే వైద్యులని సంప్రదించాలి.

అంతేకాక, వారికి కుడి భుజం పై వైపున ఏదైనా నొప్పి కలిగి బాధిస్తూ ఉన్నట్లయితే, ప్రత్యేకంగా వారికి హైపర్‌టెన్షన్ చరిత్ర, ప్రీఎక్లంప్సియా లేదా దృష్టి సమస్యలు లేదా ఊహించని వాపు లాంటి ఇతర లక్షణాలు కనబడితే, వారు వెంటనే వైద్యులను కలవాలి. గర్భధారణ సమయంలో వీపు నొప్పి అనేది తీవ్రమైన పరిస్థితి కాదు, అయినప్పటికీ ఇది చాలా అసౌకర్యాన్ని ఇంకా బాధను కలిగిస్తుంది. బాధ నుండి ఉపశమనం పొందేందుకు ఇంకా గర్భధారణను ఆరోగ్యకరంగా గడిపేందుకు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఇంకా డాక్టర్ గారి ఆదేశాలను పాటించడం అవసరం.

Tags:

Back pain during pregnancy in telugu, causes of back pain during pregnancy in telugu, tips to get rid off back pain during pregnancy in telugu, Back Pain During Pregnancy in English, Back Pain During Pregnancy in Hindi, Back Pain During Pregnancy in Tamil, Back Pain During Pregnancy in Bengali.

గర్భిణీ తల్లులకు ఇష్టమైన సౌకర్య సహచరులు

వీపు నొప్పిని తగ్గించి, మీ గర్భధారణ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసే ఉత్పత్తులు మీ రోజువారీ సౌకర్యానికి తోడుగా ఉంటాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Compression Stocking Socks - S

Compression Stocking Socks - S

Compression Stockings for Varicose Veins | Reduces Swelling | Boosts Blood Circulation

460 Moms bought
₹364₹59939% Off
Rating
4.5
(31)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.